తూర్పు గోదావరి జిల్లా తునిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని ఆరోపించారు. తొండంగి మండలం పైడికొండకు చెందిన గర్భిణీ మగబిడ్డకు ఆసుపత్రిలో జన్మనిచ్చింది. రెండు రోజులు ఆరోగ్యంగానే ఉన్నా.. నర్స్ శిశువుకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది వికటించి బాలుడు రంగు మారినట్లు బంధువులు ఆరోపించారు. అధిక మోతాదులో మందు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బంధువులు తెలిపారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స అందించారని, రికార్డులు కూడా మార్చేసారని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు చేపట్టారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
jagan bail: 'జగన్ బెయిల్ రద్దు పిటిషన్'పై.. కీలక పరిణామం!