ETV Bharat / state

కాశీ యాత్రలో ఆంధ్రులు... లాక్​డౌన్​తో అలహాబాద్​లో అవస్థలు

author img

By

Published : Mar 26, 2020, 5:28 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన 21 మంది అలహాబాద్​లో చిక్కుకున్నారు. తమ కుటుంబీకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ... సంబంధిత కుటుంబీకులు జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని కొవిడ్​ కంట్రోల్​ రూమ్ అధికారులకు వినతిపత్రం అందించారు.

21pepole stucked in kasi went from kakinada in east godavari dst
కాశీలో చిక్కుకున్న కాకినాడ వాసులు
కాశీలో చిక్కుకున్న కాకినాడ వాసులు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన వారిని జిల్లాకు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని నగరంలోని కమర్షియల్‌ టాక్స్‌ కాలనీకి చెందిన వారు అదికారులను కోరారు. ఈరోజు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని కొవిడ్‌ కంట్రోల్‌ రూంను ఆశ్రయించారు. వినతిపత్రం అందించారు. ఈనెల 9న కాకినాడ నుంచి 80 రోజుల తీర్ధయాత్రలకు వెళ్లిన 21 మంది అలహాబాద్‌లోని హరి జగన్నాథ్ శాస్త్రి చౌల్ట్రీలో చిక్కుకున్నారని తెలిపారు. వెళ్లిన వారంతా వృద్ధులేనని.. అందులో ఒకరు గుండెపోటుతో మృతి చెందారని బాధిత కుంటుంబీకులు తెలిపారు. జిల్లాకు వచ్చే సౌకర్యాలు లేక అక్కడ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

'ఉద్యోగులకు ఊరట... ఈపీఎఫ్‌ భారం కేంద్రానిదే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.