తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ.1,00,116 విరాళాన్ని అందించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన తోట శ్రావణి పేరుమీద... ఆమె తండ్రి వెంకట లింగేశ్వరరావు విరాళం సహాయ కమిషనర్‌కు అందించారు.
కన్నుల పండువగా ప్రాకార సేవ
స్వామి వారి ప్రాకార సేవ కన్నులపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి... ప్రధానాలయం చుట్టూ వేద పండితుల మంత్రోచ్ఛరణ, మేళతాళాల నడుమ ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఊయలలో గణపయ్య...ఊగుతూ దీవించయ్య