
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో కొండ చిలువ హల్ చల్ చేసింది. గాదెలపాలెం గ్రామ శివారులోని పుష్కరకాల్వలో చేపల వలలో ఈ కొండ చిలువ చిక్కుకుంది. చేపల వేటకు వెళ్లిన నాగన్న అనే వ్యక్తి వలను తీస్తుండగా ఒక్కసారిగా అది కాలికి చిక్కుకుంది. వెంటేనే స్థానికులు అక్కడకు చేరుకుని దానిని చంపేశారు. సుమారు 12 అడుగులు ఉన్న ఈ పామును చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

ఇవీ చదవండి