Sand artist : తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో...శివపార్వతుల భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. రాజానగరం వినాయకుని గుడి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం సందర్భంగా 108 సైకత శివలింగాల మధ్య ఆది దంపతుల భారీ సైకత శిల్పాన్ని సుమారు 30 అడుగుల వెడల్పుతో రూపొందించారు. సైకత శిల్ప రూపకర్త శ్రీనివాస్ తన ఇద్దరు కుమార్తెలు కలిసి.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. 'ప్రకృతిని ప్రేమిద్దాం' అన్న నినాదంతో ఈ సైకత శిల్పాన్ని సుమారు 16 గంటల సమయంలో ఆరు యూనిట్ల ఇసుకతో రూపొందించారు.
ఇవీ చదవండి: