చిత్తూరు జిల్లాలో పుర ప్రజలు వైకాపాకే పట్టం కట్టారు. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, అయిదు మున్సిపాలిటీల్లో కలిపి 131 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కేవలం 116 స్థానాలకు 344 కేంద్రాల్లో ఈనెల 10న పోలింగ్ జరిగింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో వైకాపా హవా కొనసాగింది.
తిరుపతి నగరపాలక సంస్థ వైకాపా కైవసమైంది. 49 డివిజన్లలో వైకాపా 48, తెదేపా 1 స్థానాల్లో గెలుపొందారు. అయితే గతంలో గతంలో వైకాపాకు 22 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు కార్పొరేషన్పైనా వైకాపా జెండా ఎగరేసింది. 50 డివిజన్లలో వైకాపా 46, తెదేపా 3, స్వతంత్రులు 1 స్థానాల్లో గెలుపొందారు.
మున్సిపాలిటీల్లో పలమనేరు పురపాలక సంఘం వైకాపా సొంతమైంది. ఇక్కడ మొత్తం 26 వార్డుల్లో.. వైకాపా 24, తెదేపా 2 స్థానాల్లో గెలుపొందాయి. మిగిలన వాటి ఫలితాలు రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: