కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ తిరుపతికి చెందిన ఓ యువకుడు...24 గంటల్లో వంద కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశాడు. జేఎన్టీయూ అనంతపురంలో బీటెక్ చదువుతున్న తిరుపతికి చెందిన లక్ష్మీ నరసింహ సామాజిక బాధ్యతగా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ...తిరుపతి నుంచి మదనపల్లి వరకు పాదయాత్ర నిర్వహించాడు. కరోనా వైరస్ తీవ్రత, మాస్క్ వినియోగం, భౌతిక దూరాన్ని పాటించటం తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పాదయాత్ర చేసినట్లు లక్ష్మీనరసింహ తెలిపాడు.
ఇదీచదవండి