గడిచిన రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలతో... వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. సోమల మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దళవాయి చెరువు నీటి ప్రవాహంలో నంజంపేటకు చెందిన వినోద్ అనే యువకుడు గల్లంతయ్యాడు. వినోద్ కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు.
వాగులు పొంగి పొర్లుతుండటంతో సంజంపేట, పొదలకుంటపల్లె, 81 ఉప్పరపల్లె, పెద్ద ఉప్పరపల్లె, ఆవులపల్లె, అంజమ్మపల్లె గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఉప్పర పల్లె-చౌడేపల్లె మధ్య సీతమ్మ చెరువు వంక, ఉప్పరపల్లె- బోనమంద రెడ్డివారిపల్లె మధ్య గార్గేయనది ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీడిరేవుల వంక, చెన్నపట్నం చెరువు నుంచి నీరు భారీగా ప్రవహిస్తుండటంతో సోమప్ప, బోనమంద, దోనిమాకుల, తమ్నినాయునిపల్లె చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
ఇదీచదవండి: dussehra : వైభవంగా దసరా వేడుకలు... ఆలయాల్లో భక్తుల రద్దీ