ETV Bharat / state

RAPE: వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం..అవ్వకు భోజనం తెచ్చిన బాలికపైనా.. - crime news

వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. జులాయిగా తిరిగే బాలుడు మంచం మీద కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా.. ఆమెకు భోజనం తెచ్చిన బాలికపైనా అత్యాచారానికి యత్నించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం
వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం
author img

By

Published : Oct 4, 2021, 7:10 PM IST

ఓ వృద్ధురాలిపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమె మనుమరాలిని అత్యాచారం చేసేందుకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో(boy raped old lady and tried to rape a girl in chittoor district) జరిగింది. పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో 80 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె సమీప బంధువులు ఇక్కడే మరోచోట కాపురం ఉంటున్నారు. అదే కాలనీలో జులాయిగా తిరిగే 16 ఏళ్ల బాలుడు శనివారం మధ్యాహ్నం వృద్ధురాలు మంచంపై కదలలేని స్థితిలో ఉండగా గమనించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గంట తరువాత వృద్ధురాలి మనుమరాలైన ఆరేళ్ల బాలిక అవ్వ కోసం భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది. బాలికపై కూడా అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అమ్మాయి కేకలు పెట్టడంతో పారిపోయాడు. పొరుగూరిలో పనులు చూసుకుని ఆదివారం ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక సంఘటన గురించి తెలిపింది. సమీప బంధువైన వృద్ధురాలు కూడా దీనిపై వాపోయింది. బాలిక తండ్రి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వృద్ధురాలు, బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

THIRUMALA: తిరుమల బ్రహ్మోత్సవాలు.. వెనుకబడిన వర్గాలకూ శ్రీవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.