చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా నేతల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పట్టణంలో ఆరో వార్డులో తెదేపా నాయకురాలు విజయమ్మ నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా...వైకాపా నాయకులు అడ్డుకున్నారు. నామినేషన్ వేసేందుకు వీలు లేదని చెప్పటంతో...మనస్తాపం చెందిన విజయమ్మ...ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.....తెదేపా నాయకులు ఆమెను అడ్డుకున్నారు. నామినేషన్ దాఖలు చేయనీకుండా వైకాపా నాయకులు చేస్తున్న వైనంపై తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బురఖా ధరించి వెళ్లినా అడ్డుకున్నారు...
పట్టణంలోని 15వ వార్డుకు తెదేపా తరపున నామినేషన్ వేయడానికి వెళ్లిన తనపై, తన భర్త కృష్ణపై...వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని తెదేపా నాయకురాలు రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్తే...తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఉద్దేశ్యంతో...బురఖా ధరించి వెళ్లినా...వైకాపా నాయకులు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. బురఖా తీయించి...మరో సారి నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తే చంపేస్తామంటూ బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడాలి: యనమల