చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పెద్దూరులో జనసేన కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. ఉపాధి హామీలో యంత్రాల వినియోగంపై జనసేన కార్యకర్తలు వీడియోలు పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో జనసేన కార్యకర్తలు వీడియోలు పోస్ట్ చేయగా... ఆగ్రహంతో వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే జనసేన కార్యకర్తలే దాడి చేశారంటూ పోలీసులకు వైకాపా కార్యకర్తల ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఇదీ చదవండీ... భూములకు భద్రత... ప్రాణాలకు రక్షణ ఏది: చంద్రబాబు