తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తప్ప ఇతరులెవరికీ ప్రభుత్వ ఫలాలు అందకుండా చూడాలని... సంక్షేమ పథకాలకు పేర్ల నమోదులో తమ పార్టీ వారే ఉండాలంటూ.. వైకాపా నాయకురాలు తనను వేధిస్తున్నారని.. ఓ గ్రామవాలంటీరు వాపోయింది.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం రెంతకుంట్ల వైకాపా నాయకురాలు సావిత్రమ్మ తరచూ తన విధులకు ఆటంకం కలిగిస్తోందంటూ.. గ్రామ వాలంటీర్ సౌమ్య ఆరోపించింది. సబ్సిడీ విత్తనాలు పంపిణీ, ఇళ్ల స్థలాల సంబంధించి అన్నింటిలో తనను బెదిరిస్తోందని వాపోయింది. ఈ విషయమై సావిత్రమ్మ తనపై దాడికి ప్రయత్నించిందంటూ సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇవీ చదవండి: