అంబులెన్స్(ambulance late) సకాలంలో రాకవడంతోనే ఓ మహిళ రోడ్డుపై ప్రసవించిందని.. ఈ క్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని గిరిజనులు ఆరోపించారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం గోపాలకృష్ణపురం గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. గిరిజన కాలనీకి చెందిన నిండు గర్భిణీ అయిన సుబ్బమ్మకు తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసి ఏడు గంటలైనా 108 వాహనం రాలేదని.. దీంతో చుట్టుపక్కల మహిళలు...రోడ్డుపైనే ప్రసవం(a woman delivery on road) చేసినట్లు స్థానికులు తెలిపారు.
అయితే ఉదయం 7:30 తరువాత అంబులెన్స్ వచ్చింది. అప్పటికే ప్రసవించిన మహిళతోపాటు బిడ్డను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పసికందు ప్రాణాలు కోల్పోయింది. అంబులెన్స్ సకాలంలో రాకపోవటంతోనే ఈ దారుణం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి..