ETV Bharat / state

తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడ కూడా ఆవిష్కరిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన 2021 కొత్త ఏడాది క్యాలెండర్ల‌ను మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ ప్రజల కోసం హిమయత్​నగర్ కల్యాణ మండపంలో క్యాలెండర్లు, డైరీలను రిలీజ్ చేశారు.

తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడ కూడా ఆవిష్కరిస్తున్నాం : తితిదేే

author img

By

Published : Oct 7, 2020, 10:03 AM IST

తిరుమల వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కృపా కటాక్షంతో ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రూ కరోనాపై ఘన విజ‌యం సాధించాల‌ని తితిదే ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ముద్రించిన 2021 సంవత్సర క్యాలెండర్ల‌ను మంగళవారం సుబ్బారెడ్డి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

సంప్రదాయంగా వస్తోంది..

ప్ర‌తి ఏడాది బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో తితిదే నూత‌న క్యాలెండ‌ర్లు, డైరీలు విడుద‌ల చేయ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంద‌ని ఆయన తెలిపారు. సంప్రదాయాన్ని పాటిస్తూ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా డైరీలు, క్యాలెండ‌ర్లు తిరుమలలో విడుద‌ల చేశామన్నారు.

తెలంగాణ వాసుల కోసం..
తెలంగాణ ప్రజలకు తితిదే క్యాలెండర్లు అందుబాటులో తేవటానికి ఇక్కడ ఆవిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హిమాయత్ నగర్ తితిదే కల్యాణ మండపంలో క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యుడు, స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్యక్షుడు గోవింద హరి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.