చిత్తూరు జిల్లా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని వీఆర్వోలు... ఎమ్మార్వోకు మొరపెట్టుకున్నారు. రాత్రి పదకొండు గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వారు ఎమ్మార్వోతో మాట్లాడారు.
ప్రజల అవసరాలకు పని చేసే సమయంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవని.. సిబ్బంది సహకరించాలని ఎమ్మార్వో కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ క్రమంలో ఎక్కువ సమయం విధులకు కేటాయించాల్సి ఉంటుందని... భారంగా కాకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇదీ చదవండి: తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ భవనం ఎదుట ఉద్యోగుల నిరసన