చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో.. భార్య రాజ్యలక్ష్మిపై తిరుపతి రూరల్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న శివకుమార్ బండరాయితో దాడిచేశాడు. స్టేషన్లో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం తిరిగి ఇద్దరూ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుతో విచారణ చేపట్టారు.
శివకుమార్, రాజ్యలక్షి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో శనివారం గొడవ పడ్డారు. భర్త వైఖరితో విసిగిపోయిన భార్య పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో వీఆర్వోను స్టేషన్కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా మళ్లీ వివాదం తలెత్తడంతో తనపై దాడికి దిగినట్లు బాధితురాలు పేర్కొంది.
ఇదీ చదవండి: