ETV Bharat / state

దేవుడిపై ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం!

డబ్బులు మాయమైతే... పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కొంతమంది అధికారులు మాత్రం.. దేవుడిపై ప్రమాణం చేసేందుకు వెళ్లారు. ఆ కథ తెలియాలంటే చిత్తూరు జిల్లా చౌడేపల్లెకి వెళ్లాల్సిందే..!

author img

By

Published : Nov 3, 2019, 6:20 AM IST

Updated : Nov 3, 2019, 7:39 AM IST

village secretaries oathing on god about money
దేవుడిపై ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం!

ప్రజల సొమ్ము మాయమైనా... అధికారులు స్వాహా చేసినట్లు అనుమానం వచ్చినా.. ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. చిత్తూరు జిల్లాలోని ఓ పంచాయతీ అధికారులు మాత్రం... పింఛను డబ్బులు మాయమైతే ఆ పంచాయితీనీ దేవుని ముందుకు తీసుకెళ్లారు.

పింఛన్ల సొమ్ము రూ.లక్ష మాయమైన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. మండల అధికారులు స్థానిక ఇండియన్ బ్యాంకు నుంచి రూ.28 లక్షల 43 వేల 500లను డ్రా చేసి.. పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా ఆయా గ్రామాల కార్యదర్శులకు అప్పజెప్పారు. ఈ క్రమంలో చౌడేపల్లే కార్యదర్శికి 6 లక్షల 90 వేల రూపాయలు అందించారు. చౌడేపల్లి కార్యదర్శి ఆ సొమ్మును బ్యాగులో పెట్టుకుని.. మండల కేంద్రంలోనే ఓ కార్యాలయానికి వెళ్లారు. పింఛన్లు​ పంపిణీ చేద్దామని బ్యాగు తెరచి చూస్తే.. అందులో రూ.లక్ష తక్కువగా ఉంది. చేసేదేమీ లేక.. లబోదిబోమంటూ... ఎంపీడీవోకు విషయాన్ని వివరించారు.
ఎంపీడీవో స్థానిక ఎస్సైకి తెలిపారు. పోలీసులు, ఎంపీడీవో ఇండియన్ బ్యాంకు వద్దకు వెళ్లి సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బ్యాంకు నుంచి లెక్క ప్రకారం డబ్బు తెచ్చినట్లు తేలింది. అయితే మండల అధికారులు కార్యదర్శులకు నగదు పంపంకంలో ఎవరికైనా.. ఎక్కువ ఇచ్చారా? అనే కోణంలో పరిశీలించినా.. విషయం తెలియలేదు. అనంతరం రాజనాల బండ వద్దకు అధికారులను తీసుకెళ్లారు. సత్యప్రమాణాల క్షేత్రంగా పేరొందిన ఇక్కడ... నిజాలు చెబుతారని ఓ నమ్మకం. అక్కడ పూజారి అధికారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఎవరి దగ్గర డబ్బులున్నాయో వచ్చి.. చెబితే... వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీని వల్ల ప్రమాణం కథ వాయిదా పడింది. చూడాలి ఏం జరుగుతుందో.

ఇదీ చదవండి:

సత్యం పలికించే రాయి!

Intro: చిత్తూరుజిల్లా చౌడేపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో డబ్బుమాయం...... దేవుని సన్నిధిలో ఉద్యోగులు ప్రమాణం......
Body:Ap_tpt_38_02_dabbu_mayam_gullo_pramaanam_av_ap10100.

ప్రజల సోమ్ము మాయమైతే ... అధికారులు స్వాహా చేసినట్లు అనుమానం వస్తే ఉన్నత అధికారులు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు........కాని చిత్తూరు జిల్లాలోని ఓ పంచాయతీ అధికారులు మాత్రం ... పింఛను సోమ్ము మాయమైతే ఆ పంచాయితీనీ దేవుని ముందు ఉంచారు......

పింఛన్ల సొమ్ము రూ.లక్ష మాయమైన సంఘటన గురువారం సాయంత్రం చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. పందిళ్లపల్లె పంచాయతీ కార్యదర్శి లత చారాల, శెట్టిపేట కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలో పింఛన్‌ డబ్బు పంపిణీ చేయాల్సి ఉండగా ఎంపీడీవో ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ జానకమ్మ బుధవారం స్థానిక ఇండియన్‌ బ్యాంకు నుంచి రూ.28,43,500లను గురువారం మధ్యాహ్నం చౌడేపల్లె కార్యదర్శి శ్రీనివాసులు ఇండియన్‌ బ్యాంకు నుంచి డ్రా చేసుకుని జానకమ్మకు స్వాధీనం చేశారు. ఆమె కార్యదర్శులకు నగదును పింఛన్ల పంపిణీ కోసం అప్పజెప్పింది. కార్యదర్శి లతకు రూ.6,90,000 నగదును అందజేసి లెక్క సరిచూసుకోమన్నారు.

ఆమె ఇచ్చిన సొమ్మును తన హ్యాండ్‌బ్యాగులో పెట్టుకుని పక్కనే ఉన్న కార్యదర్శుల గదిలోకి వెళ్లి బ్యాగ్‌ టేబుల్‌పై పెట్టింది. వలంటీర్లకు పింఛన్లు పంపిణీ చేసేందుకు డబ్బు ఇద్దామని బ్యాగు తెరచి చూస్తే అందులో రూ.లక్ష తక్కువ ఉన్నట్లు గుర్తించింది. దీనిపై తన బ్యాగు నుంచి రూ.లక్ష ఎలా మాయమైందో తెలియక కార్యదర్శి లబోదిబోమంది. ఎంపీడీవో శంకరయ్య కార్యాలయానికి వచ్చి విచారించగా డబ్బు పోయిందని నిర్ధారించుకున్నారు.

శుక్రవారం ఉదయం ఎంపీడీవో ఎస్‌ఐకి సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎంపీడీవో ఇద్దరు ఇండియన్‌ బ్యాంకు వద్దకు వెళ్లి సీసీ పుటేజీని పరిశీలించగా బ్యాంకు నుంచి లెక్కప్రకారం డబ్బు తెచ్చినట్లు గుర్తించారు. అయితే కార్యదర్శులకు నగదు పంపకంలో ఎవరికైనా అధికంగా నగదు ఇచ్చారా, కార్యదర్శి బ్యాగులో ఉంచిన నగదు ఎలా మాయమైంది అని ఎంపీడీవో, పోలీసులు విచారించినా విషయం ఏమీ తేలలేదు. ఇక చేసేది లేక మాయమైన రూ.లక్ష విషయం తేల్చేందుకు సత్యప్రమానాల దేవుడు దగ్గరకు సిబ్బంది వెళ్లాల్సి వచ్చింది. దేవుడిపై భక్తి,భయం ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు సత్యప్రమానాల దేవుడి దగ్గర తప్పక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. శనివారం రాజనాలబండకు వెళ్లి సత్యప్రమాణం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎంపీడీవో చెప్పారు. సూపరింటెండెంట్‌ నుంచి కార్యదర్శి లత నగదు తీసుకునే సమయంలో పొరబాటు జరిగిందా, తన అజాగ్రత్త వల్ల చోరీ జరిగిందా, సిబ్బంది చేతివాటం చూపారా అనే విషయం పోలీసుల విచారణలో తేలిక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పోలీసులు విచారించగా అందరూ మాకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో అధికారులందరూ రాజనాల బండ ప్రమాణం చేయడానికి అధికారులు అందరూ బయలుదేరి వెళ్లారు. గుడి దగ్గర రాజనాల బండ పూజారి కృష్ణయ్య వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రేపు శని వారము ప్రమాణం చేయవలెనని ఈలోపు మాకు మాకు తెలియజేస్తే వారి పేరు గోప్యంగా ఉంచుతామని అర్చకులు తెలియజేయడంతో వెనుదిరిగారు అధికారులు ఈ కార్యక్రమంలో రాజనాల బండ గ్రామస్తులు మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీవో గారిని వివరణ అడుగగా సత్య ప్రమాణం తరువాత తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
Last Updated : Nov 3, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.