చిత్తూరు జిల్లా యాదమరి మండలం 12-కమ్మపల్లె గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక సహాయకురాలిగా పని చేస్తున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మాదిరెడ్డిపల్లి గ్రామంలో మహిళ అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న చిత్తూరు పశ్చిమ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఉద్యోగినికి రెండేళ్ల కుమార్తె ఉంది.
యువతి అనుమానాస్పద మృతి - veterinary assistant suicide news
పశుసంవర్ధక సహాయకురాలిగా పనిచేస్తున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. యువతి కుటుంబ సభ్యుల సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
![యువతి అనుమానాస్పద మృతి యువతి అనుమానాస్పద మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6602672-212-6602672-1585607925607.jpg?imwidth=3840)
చిత్తూరు జిల్లా యాదమరి మండలం 12-కమ్మపల్లె గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక సహాయకురాలిగా పని చేస్తున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మాదిరెడ్డిపల్లి గ్రామంలో మహిళ అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న చిత్తూరు పశ్చిమ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఉద్యోగినికి రెండేళ్ల కుమార్తె ఉంది.
ఇదీ చూడండి: సాలూరులో వివాహిత ఆత్మహత్య