చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసుల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. ఎన్నికల వేళ ఎస్‌ఈసీ చెప్పినట్లే అధికారులు నడవాలి కానీ.. డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థే నడుస్తోందన్నారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ ఎన్నికల నిబంధనలు మార్చారా అని నిలదీశారు.
'41 నోటీసు ఇవ్వకుండా తెదేపా నేతలను ఎలా అరెస్టు చేస్తారు? రాత్రి అరెస్టు చేసి ఈ మధ్యాహ్నం వరకు ఎక్కడ తిప్పారు? ఇతర ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలకు కుప్పంలో ఏం పని?' - వర్ల రామయ్య, తెదేపా నేత
ఇదీ చదవండి: