ETV Bharat / state

Vaccine: వేర్వేరు టీకాలు..జనాలు గగ్గోలు!

author img

By

Published : Jun 21, 2021, 9:57 PM IST

కరోనా కష్టకాలంలో ఫ్రంట్​ వారియర్స్​గా వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే కొంతమంది చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎక్కడో ఒక దగ్గర వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది.. పరజ్ఞానంలో తప్పులు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గుడ్యాణంపల్లెలో జరిగింది. కొవిడ్​ వ్యాక్సిన్​ రెండు డోసులు ఒకే కంపెనీకి చెందినవి ఇవ్వాల్సి ఉండగా..మొదటి దశలో ఇచ్చిన టీకా కాకుండా 30 మందికి వేరే వ్యాక్సిన్స్​ ఇవ్వడం సంచలనమైంది. ఆదివారం నిర్వహించిన మెగా డ్రైవ్​లో ఈ ఘటన జరిగింది. అయితే బాధితులు చెబుతున్నా.. సిబ్బంది పట్టించుకోలేదని స్థానికులంటున్నారు.

vaccine
vaccine

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా టీకా రెండు డోసులలో వేర్వేరు కంపెనీ వ్యాక్సిన్లు వేయటం కలకలం రేపుతోంది. ఆదివారం నిర్వహించిన మెగా డ్రైవ్​లో భాగంగా.. పెనుమూరు మండలం గుడ్యాణం పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి డోసు కోవిషీల్డ్ వేసిన వ్యక్తులకు... రెండో డోస్​గా కోవాగ్జిన్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య కార్యకర్త.. 30 మందికిపైగా ఇదే తరహాలో టీకా వేశారు.

వైద్యుల నిర్లక్ష్యం

తొలి డోసులో కొవీషీల్ట్ టీకా వేసిన విషయం వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా.. రెండో డోసులో కొవాగ్జిన్ టీకా వేశారని గ్రామస్థులు ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును కొందరు గ్రామస్థులు మండల వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు తప్పిదాన్ని గుర్తించి టీకా వేయటాన్ని ఆపేశారు. అప్పటికే 30మందికి పైగా టీకాలు మార్చి వేసినట్లు గుర్తించారు. గ్రామానికి చేరుకున్న మండల వైద్యాధికారి టీకా మారటం ద్వారా ఇబ్బంది ఏమీ ఉండదని వ్యాక్సిన్ వేసుకున్న వారికి నచ్చజెప్పారు. మిగిలిన వారికి తొలిడోసులో వేసిన కంపెనీ టీకానే వేయించారు. వేర్వేరు టీకాలు తీసుకున్న వ్యక్తులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

negligence: గర్భవతి అన్నారు..ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే కణితి అని తేల్చారు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.