accident at mungilipattu national highway: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రహదారి వంతెన పైనుంచి ద్విచక్రవాహనం కిందపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
జిల్లాలోని జీడీ నెల్లూరుకు చెందిన తులసీరామ్.. చిత్తూరులో వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనుల నిమిత్తం.. మణికంఠ అనే వ్యక్తితో కలసి తిరుపతికి వెళ్లాడు. చిత్తూరుకు తిరిగి వస్తుండగా పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై నడింపల్లి వద్ద గల కల్వర్టును బైక్ ఢీకొనడంతో.. బ్రిడ్జిపై నుంచి ముప్పై అడుగుల లోతులో కిందపడిపోయారు.
ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో తులసిరామ్ చేసిన ఆర్తనాదాలు విన్న స్థానికులు.. చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ తులసిరామ్ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
corruption : నిధులు కాజేశారంటూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు..!