తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం వీడకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తితిదే అటవీశాఖ ఉద్యోగులు హెచ్చరించారు. తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డులో ఉన్న తితిదే డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తిరునామాలు ధరించి, గోవింద నామ స్మరణ చేస్తూ ఆందోళన చేశారు. ఇరవై నాలుగు రోజుల నుంచి కార్మికులు దీక్షలు చేస్తున్నా... తితిదే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. టైం స్కేల్ అమలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసినప్పటికీ... డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన వేతనం ఇవ్వడం లేదని వాపోయారు.
ఇదీచదవండి.