ETV Bharat / state

కరోనా లక్షణాలుంటే తిరుమలకు రావొద్దు

తిరుమలలో కరోనా పెరుగుతున్నందున తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం లక్షణాలుంటే తిరుమలకు రావొద్దని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. సర్వదర్శనం టికెట్ల కోటా తగ్గిస్తామని, ప్రత్యేక దర్శన టికెట్లపైనా ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు.

ttd eo conference on corona in tirumala
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
author img

By

Published : Mar 31, 2021, 8:38 AM IST

జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా లక్షణాలు ఉంటే తిరుమలకు రావొద్దని భక్తులకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తిరుమలలో టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తుల్లో 15 నుంచి 20 శాతం మంది గైర్హాజరు అవుతున్నారని చెప్పారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలో ఇస్తున్న శ్రీవారి సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టికెట్ల కోటాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. తిరుపతిలో కొవిడ్‌ కేసులు దాదాపు 79కి చేరుకున్నాయని, అందులో 10 మంది తితిదే ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఈవో కేఎస్‌.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కొవిడ్‌-19పై సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేశామన్నారు. బుధవారం నుంచి సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లను రోజుకు 22 వేల నుంచి 15 వేలకు తగ్గించామన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్‌ కోటా విడుదల చేయగా వాటిని భక్తులు 100% బుక్‌ చేసుకున్నారని, వాటిని రద్దుచేసే పరిస్థితి లేదన్నారు. ఏప్రిల్‌ 14 నుంచి ఆర్జిత సేవలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ పరిస్థితిని తితిదే ఛైర్మన్‌, ఈవో పరిశీలించాకే తదుపరి చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, గదుల కేటాయింపు వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, తిరుమల ఆరోగ్యాధికారి డాక్టర్‌ ఆర్‌.ఆర్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తితిదే అద్దె గదుల కోటా విడుదల

  • ఏప్రిల్‌ నెలకు సంబంధించిన అద్దె గదుల కోటాను తితిదే మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈనెల 20న ఏప్రిల్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేశారు. దాతలకు సంబంధించి ఏప్రిల్‌ కోటా దర్శనాలు, గదులనూ విడుదల చేశారు. భక్తులు తితిదే వెబ్‌సైట్‌, గోవిందం యాప్‌లోకి వెళ్లి గదులను బుక్‌ చేసుకోవచ్చు.
  • ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు, ఉత్సవాల్లోకి భక్తులను అనుమతిస్తున్న వేళ పాటించాల్సిన కొవిడ్‌ నిబంధనలను తితిదే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు మూడు రోజుల ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ నివేదికతో తిరుమలకు రావాలని సూచించారు.

ఇదీ చూడండి. తలనీలాలపై తప్పుడు ప్రచారం చేశారంటూ తితిదే ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.