ETV Bharat / state

తిరుమల: దర్శనీయ తీర్థాలకు భక్తుల అనుమతి

పది నెలల తరువాత తిరుమలలోని తీర్థాలకు భక్తులను తితిదే అనుమతించింది. మంగళవారం ఉదయం నుంచి పాపవినాశనం, ఆకాశగంగ, చక్రతీర్థంతో పాటు జపాలీ తీర్థం, వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీవారి పాదాలకు యాత్రికులను అనుమతిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ రావడం, లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ttd allowing devotes to  tourist places in tirumala

author img

By

Published : Jan 5, 2021, 7:47 PM IST

తిరుమలలో తెరుచుకున్న సందర్శన ప్రాంతాలు

దాదాపు 10 నెలల తరువాత తిరుమలలో సందర్శనీయ ప్రాంతాల్లోకి భక్తులను తితిదే అనుమతిస్తోంది. కరోనా ప్రభావంతో గతేడాది మార్చి 20 నుంచి శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గం పూర్తిగా మూసివేశారు. జూన్‌ నుంచి దశల వారీగా దర్శనానికి అనుమతిస్తున్నా.. సందర్శనీయ ప్రాంతాలకు మాత్రం అనుమతివ్వలేదు. కరోనాకు వ్యాక్సిన్‌ రావడం, లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా తిరుమలలోని తీర్థాలకు అనుమతివ్వాలని తితిదే నిర్ణయించింది.

మంగళవారం ఉదయం నుంచి పాపవినాశనం, ఆగాశగంగ, చక్రతీర్థంతో పాటు జపాలీ తీర్థం, వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీవారి పాదాలకు యాత్రికులను అనుమతిస్తున్నారు. భక్తులు లేక ఇన్నాళ్లూ బోసిపోయిన తీర్థాలు తిరిగి భక్తజన సంచారంతో కళకళలాడుతున్నాయి.

ఇదీ చదవండి:

ఆర్టీసీ సరికొత్త నిర్ణయం.. మహిళల కోసం ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.