- రాజధాని వ్యాజ్యాలపై విచారణ వాయిదా
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. రాజధాని కేసుల విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను నవంబర్ 15 కి వాయిదా వేసింది ధర్మాసనం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- కోరలు చాస్తోన్న కరోనా..!
రాష్ట్ర వ్యాప్తంగా బడులు మొదలైన తరుణంలో.. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ కలకలం రేపింది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో.. 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు నివాళులు అర్పించారు.ఆంధ్రకేసరి ధైర్యసాహసాలు, దేశభక్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో యావదాస్తిని ప్రజల కోసం ప్రకాశం పంతులు ఖర్చు చేశారని గుర్తు చేసుకున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- గుండెలనిండా అభిమానం.. అడ్డురాని వైకల్యం!
మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు రకరకాలుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి తమ ప్రేమను చాటుకున్నారు. కానీ.. వారందరికీ మించి.. అన్నంత స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ దివ్యాంగులు.. చిరుకు స్పెషల్ గా విషెస్ చెప్పారు. మెగాస్టార్ పై తమ అభిమానాన్ని తెలియజేసేందుకు.. వైకల్యం కూడా అడ్డురాదని నిరూపించారు. ఆ లవ్, ఎఫెక్షన్ ఎంత ఉన్నతంగా ఉన్నాయో.. మీరూ చూడండి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- మూడోదశ ముప్పు- కేంద్రానికి కీలక నివేదిక
దేశంలో కరోనా మూడోదశ ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హెచ్చరించింది. కరోనా మూడోదశ అక్టోబర్‌లో తారస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు నిపుణుల కమిటీ నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది ఎన్ఐడీఎం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- మోదీతో బిహార్ నేతల భేటీ
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- సురక్షితంగా మరో 146 మంది
తాలిబన్ల ఆక్రమణతో(Afghan crisis) అఫ్గాన్ నుంచి భారత పౌరుల తరలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో నాటో, అమెరికా విమానాల ద్వారా కతార్‌కు చేరుకున్న 146 మంది భారతీయులను(india evacuation afghanistan) స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. మొత్తం నాలుగు విమానాల్లో వారు భారత్ తిరిగొచ్చారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- 'పంజ్‌షేర్' తాలిబన్లకు లొంగుతుందా?
అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు(Afghanistan Taliban).. మెల్లగా పంజ్షేర్వైపు(Panjshir valley) కదిలారు. ఈ లోయను తమ వశం చేసుకునేందుకు వందలకొద్దీ ఫైటర్లు భారీ ఆయుధాలతో తరలివెళ్లారు. అయితే.. అక్కడ కాచుకుకూర్చున్న పంజ్‌షేర్ బలగాలు ఏమాత్రం వెనక్కితగ్గేది లేదంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రపంచం దృష్టి ఈ ప్రావిన్సుపైనే ఉంది. అసలు పంజ్‌షేర్‌లో ఏం జరుగుతోంది? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- సానుకూల సంకేతాలతో సూచీల జోరు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, ఆర్థిక షేర్ల దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market Today) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. లైవ్ అప్డేట్స్ కోసం లింక్ క్లిక్ చేయండి.
- 'సలార్' క్రేజీ అప్డేట్
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'సలార్'లోని కీలకపాత్రను పరిచయం చేశారు. రాజమనార్గా జగపతిబాబు (jagapathi babu salaar) కనిపించనున్నట్లు వెల్లడించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.