తడి, పొడి చెత్తలను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించేలా వ్యర్థ పదార్థాల నిర్వహణపై నగరవాసులకు అవగాహన కల్పించాలని అధికారులను తిరుపతి నగరపాలక కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశించారు. తన కార్యాలయంలో ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2021 స్వచ్ఛ సర్వేక్షన్కు సిద్ధం కావాలని... అందరూ కలిసికట్టుగా కృషి చేసి నగరాన్ని మొదటి స్థానానికి తీసుకురావొచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా ప్రకటించిన తిరుపతిలో నిబంధనలకు విరుద్ధంగా వ్వవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పారిశుద్ధ్య ప్రాధాన్యతను తెలిపేలా ప్రభుత్వ గోడలపైన చిత్రాలతో కూడిన పెయింటింగ్ వేయాలన్నారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల, రైతు బజార్, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద బయోచెస్ట్ యంత్రాలను వినియోగించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చూడాలన్నారు.
ఇదీ చదవండి: