తిరుచానూరు పద్మావతి కార్తిక బ్రహ్మోత్సవాల్లో... పుష్ప, ఫల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉద్యానవనం వీక్షకులకు కనువిందు చేస్తోంది. 26 రకాల పూలతో రూపొందించిన ఆకృతులు, పురాణ ఇతిహాసాల ప్రధాన ఘట్టాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పుష్పాలతోపాటే... ఆయుర్వేద వనమూలికలూ ప్రదర్శనకు ఉంచారు. ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేలా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: