చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండల కేంద్రంలో ఒక వస్త్ర వ్యాపారి కుటుంబానికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వస్త్ర వ్యాపారి ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి వచ్చారు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనితో పాటు అతని కుటుంబంలో భార్య, కుమార్తె, ఇంటి పనిమనిషికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. 500 మీటర్ల పరిధిలో రెడ్ జోన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.21మంది అనుమానితులను క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: కంప్యూటర్ సీపీయూలోకి దూరిన సర్పం