చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీలో మూడు నెలల గర్భిణీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన మహిళ హరితగా స్థానికులు తెలిపారు. ఈమె భర్త ఆనందరెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. లాక్డౌన్ కారణంగా ఇంట్లో నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యపై అనుమానంతో ఆనంద్ తరచూ వేధించేవాడంటూ మృతురాలి తండ్రి పాపిరెడ్డి ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :