ETV Bharat / state

కూలీల ఇంట విషాదం.. మృతదేహాలతో ధర్నా - చిత్తూరు కూలీల రోడ్డు ప్రమాదం

తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా ఆనైకట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వి.కోటకు చెందిన ముగ్గురు కూలీలు మృతి చెందారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో రోడ్డు తెలియక డ్రైవర్‌ లారీని పక్కకు పోనిచ్చాడు. ఆ సమయంలో కుదుపులకు గురైన లారీ... రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. వాహనంలో వెనుక పేర్చిన రాతికూసాలపై నిద్రిస్తున్న ముగ్గురు కూలీలు బండల మధ్య ఇరుక్కుని మృతి చెందారు.

three labours died at veluru at accident

author img

By

Published : Dec 13, 2020, 10:34 AM IST

Updated : Dec 13, 2020, 10:58 AM IST

కూలీల ధర్నా

పొట్టకూటి కోసం రాతిబండల లోడుతో తమిళనాడుకు వెళ్లిన కూలీలు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. రాతిబండలే వారి పాలిట మరణశయ్యలుగా మారాయి. నాలుగు రూపాయలు సంపాదించుకుని వస్తామని చెప్పి ఇంటినుంచి వెళ్లినవారు విగతజీవులుగా వచ్చారు.

చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని వీర గుర్రంతోపునకు చెందిన వరదరాజులు(38), రామతీర్థానికి చెందిన రాము (32), ఏడుచుట్ల కోటకు చెందిన గోవిందరాజులు(34) రాతి బండల లోడింగ్, అన్​లోడింగ్ పనులు చేస్తుంటారు. వీరివి నిరుపేద కుటుంబాలు. శనివారం ఉదయం యథావిధిగా తమిళనాడు రాష్ట్రం వేలూరులో రాతి బండలను దించడానికి ఓ వాహనంలో వెళ్లారు. వీరు వెళ్తున్న వాహనం వేలూరు సమీపంలోని అనైకట్ట ప్రాంతంలో అదుపు తప్పడంతో రాతిబండల మీద నిద్రిస్తున్న వారి వాటి కిందపడి అక్కడికక్కడే మరణించారు.

మృతదేహాలతో ధర్నా..

తమిళనాడు రాష్ట్రం వేలూరులో పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలను వి.కోటకు తీసుకొచ్చారు. ఘటన జరగ్గానే రాతిబండలను ఎగుమతి చేసే యజమాని బాబు పరారయ్యాడు. అతని ఇంటి వద్ద మృతదేహాలతో బాధితులు ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కో లక్ష చొప్పున పరిహారం, బీమా సదుపాయం అందిస్తామని చెప్పారు. మృతదేహాలను వారి వారి ఇళ్లకు తరలించారు.

ఇదీ చదవండి:

వర్షాలకు భారీగా దెబ్బతిన్న రోడ్లు.. నిధుల కొరతతో అరకొరగా మరమ్మతులు

Last Updated : Dec 13, 2020, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.