9న చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమం... ప్రారంభించనున్న జగన్ - తాజా అమ్మఒడి కార్యక్రమాలు
ఈ నెల 9న చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. రాజధానిపై రెండు కమిటీల నివేదికలు అందాయని.. ఈ విషయంపై హైపవర్ కమిటీలో చర్చిస్తామని తెలిపారు. కొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలు రూపొందిస్తున్నామన్నారు. కొత్త విధానాలపై వచ్చే బడ్జెట్లో ప్రకటిస్తామని తెలిపారు. అదాని సంస్థ విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉందన్నారు. ఆ సంస్థ 400 ఎకరాలు అడగలేదని.... రూ.70 వేల కోట్ల పెట్టుబడులు అన్నదానిలో వాస్తవం లేదన్నారు. రూ.3వేల నుంచి రూ.4 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారని తెలిపారు. సౌది అరేబియాకు చెందిన 4 కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కంపెనీలు రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని వివరించారు.