ETV Bharat / state

Tirumala: సిఫారసు లేఖల స్వీకరణ నేడు రద్దు: తితిదే

తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా వీఐపీ బ్రేక్‌ దర్శనంను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే తితిదేపై దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ttd
తితిదే
author img

By

Published : Jul 15, 2021, 9:49 AM IST

శ్రీవారి ఆలయంలో ఈనెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా గురువారం వీఐపీ బ్రేక్‌ దర్శనం సిఫారసు లేఖలను స్వీకరించమని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

తితిదేపై అసత్య ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు
తితిదే వెబ్‌సైట్‌లోని తోమాల సేవను కొందరు వ్యక్తులు తోమస్‌ సేవగా మార్చి అసత్య ప్రచారం చేస్తున్నారని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసి, భక్తుల మనోభావాలకు భంగం కలిగించే ఇలాంటి కుట్రలను తీవ్రంగా పరిగణిస్తోందని.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇదీ చదవండీ.. TS - AP WATER WAR: మా నీటికి ఎసరు.. తెలంగాణను అడ్డుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.