చిత్తూరు జిల్లా శ్రీకావేరిరాజుపురం పంచాయతీ ఏటుకూరి పల్లెలో ఓ యువతి బావిలో పడిపోయింది. నందిని(18) బహిర్భూమి కోసం వెళ్లగా.. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు స్థానికులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గంటలు గడుస్తున్నా యువతి ఆచూకీ లభించలేదు. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఇలాంటి దుస్సంఘటన జరగడం ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: భాకరాపేట కనుమ దారి ప్రమాదాలకు నిలయం