చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట రైల్వేస్టేషన్‌కు చెందిన మల్లిక.. గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లి వచ్చిన తీరు.. గ్రామస్థులను కలిచివేసింది. ఏజెంట్ల మోసానికి కష్టాలపాలై అనారోగ్యంతో చావు బతుకుల మధ్య స్వగ్రామం చేరింది. ఏజెంట్లు చేసిన మోసాలను చెప్పి కన్నుమూసింది.
గోపిదిన్నె గ్రామానికి చెందిన రాధమ్మ కువైట్ వెళ్ళింది. ఇప్పటి వరకు ఈమె ఆచూకీ తెలియక ఆమె కుమార్తె సుకన్య మదనపల్లె పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి అచూకీ తెలపాలని పోలీసులను కోరింది.
ఇలా ఎన్నో కథలు చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తంబళపల్లె, పీలేరు, మదనపల్లె, అంగళ్లు, కలిచర్ల, కోటాల మొదలగు ప్రాంతాల నుంచి ప్రజలు వలసలు పోతున్నారు. మల్లిక, శ్యామల, రాధమ్మలాంటి ఎందరో గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకుపోతున్నారు.
గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లిన బాధితులను వెంటనే గుర్తించి స్వగ్రామాలకు చేర్చాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోసాలు చేస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: