Misbah suicide case Updates: చిత్తూరు జిల్లా పలమనేరులో ఇటీవల మిస్బా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో ఉపాధ్యాయుడు రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని తమిళనాడులోని రామేశ్వరంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రామేశ్వరం కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ భార్య నడుపుతున్న ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థిని మిస్బా.. కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో శ్రీధర్ ఉత్తర్వులు ఇవ్వగా.. ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.
వైకాపా నేత సునీల్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు: మైనారిటీ విద్యార్థిని మిస్బా మృతికి కారకుడైన వైకాపా నేత సునీల్‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మిస్బా చదువుతున్న పాఠశాల నిర్వాహకుడు రమేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతన్ని ఆ దిశగా ప్రేరేపించిన సునీల్‌ను ఎందుకు వదిలిపెట్టారని నిలధీశారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలు.. సైకో సునీల్‌ను కాపాడుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆడబిడ్డలు తనకు అక్కచెల్లెమ్మలు.. వారిపిల్లలకు నేను మేనమామను అని చెప్పుకునే జగన్.. మేనమామ పాత్ర పోషించడంలో విఫలమయ్యారని విమర్శించారు. మిస్బా కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Student Suicide in palamaner: చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తనతో... తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలమనేరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని... తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధరించారు.
ఇదీ చదవండి: