ETV Bharat / state

atchennaidu: 'రాష్ట్రాన్ని అరాచకాలు, దౌర్జన్యాలకు చిరునామాగా మార్చారు' - Chittoor district latest news

చిత్తూరు జిల్లాలో తెదేపా నేత మునెప్పపై వైకాపా నేతలు దాడులు చేయటాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్​ను అరాచకాలు, ఆకృత్యాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు చిరునామాగా సీఎం జగన్ మార్చేశారని మండిపడ్డారు. పేదల ఆస్తులు అక్రమించి దాడులతో మారణహోమం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా? అని నిలదీశారు.

atchennaidu
అచ్చెన్నాయుడు
author img

By

Published : Jun 26, 2021, 12:25 PM IST

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఆర్.నడింపల్లిలో తెదేపా నేత మునెప్పపై వైకాపా నేతలు కత్తులతో దాడి చేశారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) ధ్వజమెత్తారు. మునెప్ప భూమిని కబ్జా చేయడం సహా... అడ్డుకున్నందుకు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. మునెప్పకు పార్టీ అండగా ఉంటుందన్నారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకునేవరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు.

అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్​ను అరాచకాలు, ఆకృత్యాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు చిరునామాగా జగన్ మార్చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పేదల ఆస్తులు అక్రమించి దాడులతో మారణహోమం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా? అని నిలదీశారు. వైకాపా పాలనలో దాడులు జరగని రోజు అంటూ లేదన్నారు. రాజారెడ్డి కత్తుల రాజ్యాంగం అమలు చేస్తూ... అడ్డుకున్న వారిని హతమార్చేందుకు తెగబడుతున్నారని ఆరోపించారు. జగన్​ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మండిస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

'తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.