రాష్ట్రంలో రైతు సమస్యలపై తెదేపా చేపడుతున్న 'రైతు కోసం తెలుగుదేశం' నిరసనలు.. ఇవాళ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంట్ స్థానాల పరిధిలో కొనసాగనున్నాయి. ఈ ఆందోళనలకు తెలుగుదేశం సీనియర్ నేత బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు. పంట విమామం, ఇన్‌పుట్ సబ్సీడీ, పంట పరిహారం అందకపోవడం, మోటార్లకు మీటర్లు, బిందు సేద్యం, ఎరువుల కొరత, ఆక్వా ఫార్మింగ్ తదితర అంశాలపై ధర్నాలు చేసి తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నారు. వైకాపా ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఆయా పార్లమెంట్ స్థానాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజవర్గాల్లో రైతులతో కలిసి తెలుగుదేశం నేతలు ఆందోళనలు ఆందోళనలు నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్నారు.
బుధవారం ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహించిన నిరసనల్లో రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గత రెండేళ్లలో వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేతలు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి..