చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చొక్కా చిరిగింది. దీంతో ఆగ్రహంచిన తెదేపా శ్రేణులు..పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: Municipal Elections: కుప్పం పురపాలకలో హై'డ్రామా'..అధికార, ప్రతిపక్షాల రాజకీయ రగడ