మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో తెదేపా నాయకులు ఆందోళన నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎన్టీఆర్ కూడలి నుంచి కృష్ణాపురం ఠాణా వరకూ పాదయాత్ర నిర్వహించారు. ర్యాలీలో తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి, పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా...శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వట్లేదని ఎమ్మెల్సీ మండిపడ్డారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.
శాంతియుతంగా ర్యాలీలు చేసుకోనివ్వట్లేదు - తిరుపతిలో తెదేపా నాయకుల ధర్నా
మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా శాంతియుతంగా ర్యాలీలు చేసుకోనివ్వట్లేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో తెదేపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.