మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. వైద్యుడు, 3 సార్లు శాసన సభ్యుడు, మంత్రి గా సుబ్బయ్య చేసిన సేవలను చంద్రబాబు ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియడారు. ఆయన మృతి, పలమనేరు నియోజకవర్గానికే కాకుండా చిత్తూరు జిల్లాకు తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకురాలని పేర్కొన్నారు.
తెదేపా తరఫున సుబ్బయ్య వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికై... ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్, పౌరసరఫరాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. పట్నం సుబ్బయ్య కుటుంబ సభ్యులకు లోకేశ్,అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: నంద్యాల యువకుడు కిడ్నాప్ కలకలం