ETV Bharat / state

TDP PROTEST: తెదేపా అభ్యర్థి భర్త అరెస్ట్.. పీఎస్​ ఎదుట కోటంరెడ్డి ఆందోళన

నెల్లూరు కార్పొరేషన్ 4వ డివిజన్ తెదేపా అభ్యర్థి భర్త మామిడాల మధును అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోలీస్ స్టేషన్​ ఎదుట ధర్నాకి దిగారు. అతడిని కావాలనే అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేశారు.

tdp-leaders-kotamreddy-srinivasulu-reddy-infront-of-nellore-ps
తెదేపా అభ్యర్థి భర్త అరెస్ట్.. పీస్​ ఎదుట కోటంరెడ్డి ఆందోళన
author img

By

Published : Nov 14, 2021, 9:32 AM IST

నెల్లూరు కార్పొరేషన్ 4వ డివిజన్ తెదేపా అభ్యర్థి భర్త మామిడాల మధును అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నవాబ్​పేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పీఎస్​కు వెళ్లి.. పోలీసుస్టేషన్ ఆవరణలోనే బైఠాయించారు. మధును విడుదల చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని చెబుతున్నారు. పోలీసులు కావాలనే మధును అరెస్ట్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కోటంరెడ్డి అన్నారు. అతని జేబులో రూ.2 వేలు ఉన్నాయనే సాకుతోనే.. మధును నిర్బంధించారని తెదేపా శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుప్పం మున్సిపాలిటీలో స్థానికేతరులు ఉన్నారని తెదేపా నేత అశోక్ బాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రచార పర్వం ముగిసినా.. పెద్దఎత్తున స్థానికేతరులు పట్టణంలో తిష్టవేశారని పేర్కొన్నారు. పుంగనూరు, తంబాలపల్లి నియోజకవర్గాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలను తీసుకొచ్చి.. కుప్పానికి 15 కి.మీ. దూరంలో 300 మందికి వసతి కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపాకు చెందిన వారంతా అక్కడే బస చేశారని వివరించారు. అలాగే.. ఓటుకు డబ్బులు పంచుతున్నారంటూ.. పలు వీడియోలను ఫిర్యాదుకు జతచేశారు.

రాజా పార్కు కమ్యూనిటీ హాలులో 60 మందికి, తంబాలపల్లి నుంచి వచ్చిన 500 మంది మహిళలకు కుప్పం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో.. వసతి కల్పించారని ఫిర్యాదులో అశోక్ బాబు పేర్కొన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: earthquake: విశాఖలో పలుచోట్ల భూప్రకంపనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.