జడ్డి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. బీహార్‌ను మించిపోయి రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. వైకాపా అనైతిక చర్యలను ఎండగడుతున్నందుకే దళితులపై ఈ రకమైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిందితులను 24 గంటల్లోపు అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ మరచి 13 జిల్లాల్లో దాడుల వికేంద్రీకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు.
జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడికి పాల్పడటం దుర్మార్గం. వైకాపా అవినీతిని, వైఫల్యాలను ప్రశ్నించిన వారిని చిదిమేసే దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా లేక రాక్షసులు పాలిస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. నియంతలు పాలకులైతే పరిపాలన ఇలాగే ఉంటుంది. రాష్ట్రంలో వైకాపా నేతల వికృత చేష్టలను ప్రజలు గమనించాలి
- కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు