ETV Bharat / state

'సీఈసీ గారూ.. అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయండి' - వైకాపా పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికలో వైకాపా ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కొందరు పోలీసు అధికారులు పక్షపాత ధోరణి సహా రమణ దీక్షితుల నియామకంపై ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, మద్దిపాటి వెంకటరాజులు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు
author img

By

Published : Apr 11, 2021, 5:54 AM IST

తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని తెదేపా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగంతో పాటు... కొందరు పోలీస్ అధికారులు పక్షపాత ధోరణి సహా రమణ దీక్షితుల నియామకంపై ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, మద్దిపాటి వెంకటరాజులు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు.

'వైకాపాకు మద్ధతు అడిగారు'

సత్యవేడు అసెంబ్లీ పరిధిలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించి వైకాపాకు మద్దతుగా పని చేయాలని ఆదేశించినట్లు తెలుగుదేశం నేతలు లేఖలో ఫిర్యాదు చేశారు.

'అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్లను నియమించాలి'

కొందరు పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న తెలుగుదేశం... దీనిని నివారించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల అబ్జర్వర్, బూత్ లెవల్​లో మైక్రో అబ్జర్వర్లను నియమించాలని ఈసీని కోరింది.

ఇదీ చదవండి: 'నన్ను ఇరికించే కుట్ర చేశారు.. సీబీఐతో విచారణ జరిపించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.