చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలంలో.. పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకుంది. వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో.. తెదేపా పులివర్తి నాని, ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాసులురెడ్డిల ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. వైకాపా నాయకుల ప్రలోభాలకు గురి కావద్దని.. బెదిరింపులకు లొంగవద్దని అభ్యర్థులకు పులివర్తి నాని సూచించారు.
ఇదీ చదవండి: నేటితో ముగియనున్న తొలివిడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ