ఎర్ర చందనాన్ని(RED SANDAL WOOD) రక్షించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తూ తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులకు స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో పట్టుబడుతూనే ఉన్నారు. కూంబింగ్, చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసినప్పటికీ స్మగ్లర్లు, ఎర్రచందనం దుంగలు పట్టుబడుతూనే ఉన్నాయి.
తాజాగా.. చిత్తూరు జిల్లాలోని శేషాచలం(SESHACHALAM FOREST) అడవుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల(SMUGGLERS) కోసం జల్లెడ పడుతున్నారు. ఈ తరుణంలో ఉదయం చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలో ఐదు ఏ-గ్రేడు ఎర్రచందనం దుంగలతో పాటుగా ఒక తమిళ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిరంతర కూంబింగ్‌లో భాగంగా శ్రీవారిమెట్టు సమీపంలోని నాగపట్ల వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న అధికారులకు దేవుని గుడి వద్ద ఐదుగురు స్మగ్లర్లు తారసపడ్డారు.
అధికారుల రాకను గమనించిన స్మగ్లర్లు దుంగలను అక్కడే వదిలేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. సమీప ప్రాంతంలో తమిళనాడులోని తిరువన్నామలై చెందిన దొరస్వామి (50) అనే స్మగ్లర్‌తో పాటు.. ఐదు ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన మిగిలిన స్మగ్లర్ల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: