Tamil Nadu Govt Tribute to Andhra Pradesh Person: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి ఎందరో జీవితాలలో సంతోషాన్ని నింపారు. రోడ్డు ప్రమాదం జరిగి.. తాను చనిపోతూ పలువురికి ప్రాణం పోశారు. తమిళనాడులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి తన అవయవాలు దానం చేశారు. దీంతో ఆ వ్యక్తికి తమిళనాడు ప్రభుత్వం నివాళులు అర్పించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అవయవాలను దానం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు.
చెన్నైలో యువరాజులు నాయుడు అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. అతనిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతని బ్రెయిన్ డెడ్ కావడంతో.. అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేస్తున్నట్లు తెలిపారు. అతని కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా అభినందిస్తున్నారు.
Organs Donation: విషాదంలోనూ ఆదర్శంగా నిలిచిన తల్లిదండ్రులు.. కుమారుడి అవయవాలు దానం
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులో తన అవయవాలను దానం చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన యువరాజులు నాయుడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించింది. చిత్తూరు జిల్లాకు చెందిన యువరాజులు నాయుడు (61).. నవంబర్ 3వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో అతనిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. కానీ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం కారణంగా యువరాజులు నాయుడు బ్రెయిన్ డెడ్ అయి.. 7వ తేదీ సాయంత్రం మృతి చెందారు.
అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించిన కుటుంబ సభ్యులు: అయితే యువరాజుల నాయుడు భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులంతా ఆయన అవయవాలను దానం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు యువరాజుల నాయుడి కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, గుండె కవాటాలు దానం చేశారు.
మహిళ అవయవదానం.. 15 సంవత్సరాల బాలుడి జీవితంలో వెలుగులు
కొనియాడిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్: తన అవయవాలను దానం చేసి మరెంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన యువరాజుల నాయుడు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. స్టాలిన్ నిర్ణయాన్ని తమళనాడు ప్రజలతో పాటు ఇతర రాజకీయ నాయకులు కూడా స్వాగతించారు. ఈ ప్రకటనను ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా స్వాగతించారు.
నివాళులర్పించిన అధికారులు: అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం తరపున.. పలువురు అధికారులు నవంబర్ 9న ఆస్పత్రికి చేరుకుని యువరాజులు నాయుడికి నివాళులర్పించారు. సెంట్రల్ చెన్నై ఆర్టీవో పి. క్యూరీ, ఎగ్మోర్ తహసీల్దార్ శివ కుమార్.. యువరాజులు నాయుడు ఉన్న ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పించారు. యువరాజులు నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Organ Donation: ఒక తల్లికి బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికేఉంటా..