ETV Bharat / state

'శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆయుర్వేద వైద్యులకు అనుమతి సరికాదు' - ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్స అనుమతి సరికాదు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్​ఎమ్​సీ వైద్య విధానం ద్వారా ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్స చేసే అనుమతి సరికాదని...చిత్తూరులో వైద్యులు నిరసన తెలిపారు.

Surgical permission is not appropriate for Ayurvedic doctors
'ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్స అనుమతి సరికాదు'
author img

By

Published : Dec 8, 2020, 5:34 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్​ఎంసీ వైద్య విధానం ద్వారా ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్స చేసే అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ చిత్తూరు ఐఎమ్​ఏ వైద్యులు నిరసన తెలిపారు. స్థానిక లక్ష్మి ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఐఎమ్​ఏ నగర కార్యదర్శి నారాయణ రెడ్డి ఆయుర్వేద వైద్యం అందించే వారికి కొత్తగా 58 రకాల శస్త్ర చికిత్సకు అనుమతివ్వటం సరికాదన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎమ్​ఏ నాయకులు వెంకటరమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఉప్పు ప్రక్షాళనకు..తొలి అడుగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.