తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వసతి గృహంలో ఉంటున్న పరిశోధక విద్యార్థిని శ్యామల ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన ఆమె పరిశోధనల సమాచార సేకరణ కోసం తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు వచ్చింది. గత రాత్రి గుంటూరుకు చెందిన ఓ యువకుడితో ఫోన్ సంభాషణ ముగించిన అనంతరం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె స్నేహితులు గది వద్దకు వెళ్లి పరిశీలించగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్న శ్యామలను కిందకు దింపి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి వసతి గృహ సిబ్బంది రుయా ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామల వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు వాపోతున్నారు.
శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య - girl suicide at sri venkateswara agricultural college news
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట ప్రాంతానికి చెందిన శ్యామల అనే విద్యార్థిని వసతి గృహంలో ఉంటూ పరిశోధన చేస్తుండేది. స్నేహితులు పరిశీలించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.