తిరుపతి సమీపంలోని గొల్లవానిగుంటకు చెందిన ఎ.గోవిందరాజులు (48) కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన అతడు.. వైద్యం కోసం చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు చేసినట్టు కుటుంబీకులు చెప్పారు.
ఈ క్రమంలో.. వ్యాధి నయం కాక.. జీవితంపై విరక్తి చెంది కత్తితో కడుపు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోనగర్ లోని కనకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డట్టు అలిపిరి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: