చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శేషప్పతోట ప్రాంతానికి చెందిన నౌషాద్... సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లి అక్కడ కొంతమందితో గొడవపడ్డాడు. ఈ ఘటన అనంతరం నౌషాద్కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన నౌషాద్... ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. బలవన్మరణానికి పాల్పడుతున్న దృశ్యాలను వీడియో తీశాడు. గమనించిన స్నేహితులు నౌషాద్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీచదవండి.